మాటై మారేనా ఈ బాధ
పదమై కూరేనా ఈ గాధ
ఎందుకో ఈ పూట కంట నీరు ఆగనంటుంది
ఉప్పెనై బయటకు ఉరుకుతుంది ,,,,,
ప్రతి ఘడియ నిను కలిసే సమయం కోసం ఎదురు చూపులు
నువ్వు పిలిచే ఒక పిలుపు కోసం ఆరాటాలు
నీ మోము పై ఓ చిన్న నవ్వు కోసం
ఈ పిచ్చి మనసు వేయించే వెర్రి వేషాలు
బాధ కూర్చిన ఈ తీపి ఘడియలు ఎన్నో
గుప్పెడైన ఈ గుండెకు చెప్పనైన అలివి కాని ఊసులు ఏమిటో ....
అలుపెరగని సంద్రపు అలలు
ఏదో ఆశతో తీరం వైపు ఎగసినట్లు..
పగలు రేయి బేదం ఎరుగక
ఈ హృదయం నీ చెంతకు పరుగులు తీస్తుంది ....
మన జీవన గ్రంధాన
జారుతున్న ప్రతి క్షణం ఒక పేజీలా తిరుగుతుంది
జరుగుతున్నప్రతి రోజూ ఒక అధ్యాయ మై మారుతుంది
ఇందులో ఏర్పడిన అవగాహన ఎంతో
గ్రహించ వలసిన జ్ఞానం ఇంకెంతో .....