Feb 20, 2010

ప్రేరణ.....

సాగుతున్న జీవితాన స్నేహమై చేరావు
బ్రతకటానికి జీవించటానికి తేడ తెలియచేసావు
అందరిలో ఒంటరిగా ఉన్న నాకు
నీ కంటూ ఒకరున్నారని చెప్పావు...
నా కళలకి ప్రేరణ నువ్వు
సాగే నా ప్రతి అడుగుకి పాదం నువ్వు..........

మౌన భాష.......

లోలోని ఈ భావానికి అర్ధం ఎమిటో
ఈ మౌన భాష భారం ఎమిటో
మాటలకు అందని ఈ భావాన్ని
కనులతొ తెలుపుదామను కుంటే
కన్నీటిని తనలోనే దాచుకుని
కను పాపలు కూడ సహకరించరావె,
ఫైపైన చిరు నవ్వుతో నీ పెదాలు
దాచుతున్న ప్రశ్నలు నను చేరకుండునా
ఫ్రేమ నిండిన నీ కనుల దాగిన బాధ
నను తాక కుండునా ..
మనసుల భాష మౌనం ఐనా
ఆ మౌనానికి కూరితే పదం
కావా అపార్ధాలు దూరం ……………

ఓ సైనికుడిని నేను ...................

వెతుకుతోంది చూపు తీరం కోసం
సాగిపొతోంది పాదం గమ్యం కోసం
అంతు తెలియని సిఖరపు అంచుల పై
మంచు పరుపులలో కూరుకుంటున్న అడుగుల తో
తాగటానికి గుక్కెడు నీళ్ళు కూడా
కరువైశ్వాసకు వాయువు కూడా తరుగై
ఏ క్షణాన ఏ గుండు శత్రువు తుపాకి
నుండి గుండెల్లోకి దూసుకెళ్తుందో కూడ తెలియకుండా ……
నే పుట్టిన నా దేశం కోసం
పొరుగు వాడు పన్నుతున్న కుట్రలకు అడ్డువేస్తూ
అను క్షణం ప్రాణాలని పణంగా పెట్టి పొరాడుతున్న
సిపాయి ని నేను……. .
మా వాడు మిలటరీలో ఉన్నాడు అని చెప్పుకుని
గర్వపడే నను కన్న వాళ్ళకి దిన దిన గండంగా
జీవితాంతం తొడు నీడై ఉంటానన్న
ఆలికంటి చూపుకి కూడా దూరంగా….
కన్న బిడ్డ నొరారా నాన్న అంటే
పలుక లేనంత నిస్సహాయంగా
గుండె ధిటువు చేసుకొని
నాలాంటి ఎందరో సోదరులతో బాధలు పంచుకుంటూ
నాలాగే నా బిడ్డ కూడా దేశం కోసం పోరాడుతాడు
అని గర్వంగా చెప్పుకునే
ఓ తండ్రిని నేను…………
ఎల్లప్పుడూ తుపాకి ఎక్కు పెట్టి
యుద్ధానికి సిద్ధమంటూ
నా వాళ్ళ క్షేమమే ముఖ్యమంటూ
జీవిస్తున్నఓ సిపాయి ని నేను……
ప్రాణం ఉన్నంత వరుకూ ఒక్కటే ధ్యేయంగా
సాగుతున్న ఓ సైనికుడిని నేను………..