Nov 26, 2009

కలవరం...........

మది వీణ ను మీటిన నీ అనురాగం
నను కదిలించిన కడలి తరంగం
అలసి సొలసి వలచి
నీ ఒడిలో సేద తీరిన నా మదిపై
రాలిన నీ కన్నీటి బొట్టు తెలిపెను
నీ ఎద లో పొంగిన ఆవేదనను
వెచ్చటి ఆ నీటి బొట్టు
రేపెను నాలో అలజడి
తడిపెను నను నీ ప్రేమ సంద్రపు ఒరవడిలో
ఆ క్షణం నా అనుభవం
అనిర్వచనీయం....
ఓ మధుర జ్ఞాపకం .............
మరపురాని ఆ ప్రణయ తరుణం ,
కలకాలం నిలిచిపోయే ఓ కమ్మని వరం....
కలవరం ....................................

Nov 20, 2009

నువ్వు ..................

సాగుతున్న జీవితాన స్నేహమై చేరావు
బ్రతకటానికి జీవించటానికి తేడ తెలియచేసావు
అందరిలో ఒంటరిగా ఉన్న నాకు
నీ కంటూ ఒకరున్నారని చెప్పావు...
నా కళలకి ప్రేరణ నువ్వు
సాగే నా ప్రతి అడుగుకి పాదం నువ్వు..........

వదిగిపోనీ..................

ఓ సారి మనసార మన్నించవా
ప్రియమార దరిచేరి మాటాడవా
గోధూళి వేళ గూటికి చేరే గువ్వలా
నీ కోసం వేచి ఉన్నా
వదిగిపోనీ నీ గుండెలో
తన సవ్వడినై
కలిసిపోనీ నీ ఊపిరిలో
సడిలేని గాలినై
ఇమిడిపోనీ నీ మాటలలో
చిన్న పలుకునై
తడిసిపోనీ నీ ఊసుల చినుకులలో
లేత చిగురునై
నను తలచావన్న ఒక ఊహ చాలు
నా మనసు సరాగమావ్వగా
నను పిలచావన్నఒక ఉనికి చాలు
ఆగిన ఈ గుండె తిరిగి సందడి చేయగా ,,,,