Aug 28, 2009

nestam

జీవితంలో చీకట్లు ఆవరిస్తున్న ఆ క్షణాన
ఒక జ్యోతిలా వెలిగావు
వడలిపోతున్నఈ లతపై
రవి తొలికిరణం లా ప్రసరించావు
నీ ఉనికితో నాపై నాకు నమ్మకం కలిగించావు
నీ ఊహతో ఈ ప్రపంచాన్ని మరిపించి ముందుకు నడిపించావు
నా జీవితాన ఒక మిణుకులా మెరిసి
అలలా ఎగసి ,నా లోఉన్న కళలకు ప్రాణం పోసావు
వద్దు అంటూనే నా మదిలో నిండావు
చూస్తూ వుండగానే బ్రతుకున భాగమయ్యావు
ఎంతని చెప్పను ,ఏమని చెప్పను
ఓ నా నేస్తమా
ఎలా చెప్పను ఈ ప్రపంచాన్ని ఎదుర్కొనే
ధైర్యం నాలో నింపింది నువ్వే అని .....

2 comments:

  1. chala bagundhandi mee bhavana

    inka manchivenno rasthundandi

    ReplyDelete
  2. పెళ్ళి అయిన తరువాత ప్రతి జంటా చదవాల్సిన అద్భుతమైన భావుకత ఇది.

    ఈ భావుకతను అందమైన ఒక గ్రీటింగ్ కార్డ్ పై ముద్రించి ప్రేమించిన వారికి గిఫ్ట్ ఇస్తే ఆహా ఊహే అద్భుతంగా ఉంది.

    ReplyDelete