మనసున దాచిన భావాలు ఎన్నో ,
కునుకుని దోచిన కలలు మరెన్నో,
కంటికి కునుకు కరువాయే ,
తనువుకి తపన చేరువాయే,
నీ చూపుకై ఎదురుచూస్తున్న నా కన్నులు ,
నీ మాటకై పరితపిస్తున్న నా మది ,
ఇది కన్నుల యొక్క ఆరాటమా,
లేక మనసుల మధ్య పోరాటమా,
ఎటు తేల్చుకోలేక
ఏదీ పోల్చుకోలేక
నాలో నిన్ను ఇముడ్చుకొని
నీ లోనే జీవిస్తున్నా
No comments:
Post a Comment