Oct 30, 2009

ఆడపిల్ల ...

ఆడపిల్ల ఆడపిల్ల
అని ఎందుకంత తల్లడిల్లుతున్నారు
నాది మాత్రం కాదా పేగు బంధం
ఈ జీవికి మీరు కాదా పోసింది ప్రాణం,,

కంటిపాపలా కాపాడ వలసిన
తల్లిదండ్రులకే ఎక్కువవగా
ఎవరో ఏదో అన్నారని ఏల ఈ వ్యధ,,

అన్నదమ్ములతో కలిసి మెలిసి
నడవ వలసిన నన్ను
అణిచి మణిచి ఉంచారు
ఆడ పిల్ల అని పెంచారు,,

చదువు-సంధ్య లెందుకన్నారు
ఇంటి పనులు నేర్వమన్నారు
అడుగడుగునా ఆటు-పోట్లు
బ్రతుకంతా వెనుకడుగులు ,,

ప్రేమ పంచితే నేను మాత్రం వెలుగు చూపనా
అంధకారాన వెలుగు రేఖై నిలువనా
కనుపాపల నిండిన కలలతో
వినువీధుల విహరింపజేయనా
ఆకాశాల ఎత్తుకి ఎదిగి చూపనా,,

బీడు వారిన పుడమి పై తొలకరి చినుకవ్వనా
మీ జీవితానహరివిల్లు రంగులు నింపనా,
సాటి వారికి నేను మాత్రం సాటి రానా
ప్రపంచాన్నిఎదిరించి ముందడుగు వెయ్యలేనా,,

ఆడ పిల్ల ఆడ పిల్ల
అని ఎందుకంత సోమ్మసిల్లు చున్నారు,
నేను మాత్రం మీ బిడ్డను కానా
జీవితాంతం మీ తోడై నిలువనా,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

గుండె చప్పుడు ,,,,,,

నే చేసిన తప్పేమి ప్రియతమా
మనసారా ఆరాధించటమే
నే చేసిన నేరమా ..
తలవకూడదన్నా తలపు ఆగదే
మరిచిపోవాలన్నా మరపు రాదే
ఉహలతో పయనిస్తున్న ప్రాణికి ఆశలు రేపావు
కలలు నిజమయ్యే క్షణాన కల్లలు చేసావు
సప్త వర్ణాల రంగవల్లి అన్నావు
నింగిన విరిసిన జాబిల్లి అన్నావు
నా ఉహల వల్లిని అల్లిన రంగులు చేరిపావు
నీ తలపుల జాబిల్లిని మేఘాల మాటుకి జరిపావు
ఆ నల్ల మబ్బులు కరిగేదేప్పుడు ..
ఈ గుండె చప్పుడు
నీ మనసుని తాకేదేప్పుడు ,,,,,,,,,,,,

Oct 15, 2009

i wish...

I wish ,I could be with you
Even as a drop of dew
That shines n gloss for moments few
And slides away on a flowers hue......

I wish, I could be with you
Even as a part of a dream
That can make me live
The life that may never come true......

I wish, I could be with you
Even as a tear in your eye
That flows out in pain
Soothing the heart that s tired and heavy.......

I wish, I could be with you
Even as a smile on your face
That can fill the colours of rainbow
In the lives that are dark and cloudy..............

I wish, I could be with you
Even as a' day in your life
That is filled with love and joy
Sufficient for the ages to live...............

Oct 8, 2009

పయనం

మన కలయిక
ఒక ప్రణయ మాలిక
పున్నమి రేయి చంద్రిక
మన స్నేహం
ఒక అనూహ్య పరిమళం
అరవిరిసిన సుమ గంధం
మన పయనం
ఒక తీయని అనుభవం
పలికించెను ప్రేమ గీతం
మన గమ్యం
అంతులేని ఆ ఆకాశం
మెరిసే తారల సమాహారం