Oct 8, 2009

పయనం

మన కలయిక
ఒక ప్రణయ మాలిక
పున్నమి రేయి చంద్రిక
మన స్నేహం
ఒక అనూహ్య పరిమళం
అరవిరిసిన సుమ గంధం
మన పయనం
ఒక తీయని అనుభవం
పలికించెను ప్రేమ గీతం
మన గమ్యం
అంతులేని ఆ ఆకాశం
మెరిసే తారల సమాహారం

2 comments:

  1. ప్రేమిస్తే ఇంత అందమైన భావాలు కలుగుతాయా ?

    హే భగవంతుడా ఆ భాగ్యాన్ని నాకు కలిగించు. ఈ కఠిన హృదయడిపై ఇకనైనా కరుణించు.

    ReplyDelete