Sep 21, 2009

సాగర కెరటం ,,,,,,,,,,,,,,,,,,

నీ నుదుట అమరిన సింధూరం
వెలకట్టలేని ఓ బంగారం
మసక దీపపు వెలుగులో నీ సింగారం
మనసు దోచెనే చెలీ నీ వయ్యారం
వంపుల బాటల విరబూసిన జాజులు
తలపించే నీ నవ్వులు
మదిలో మెదిలిన నీ ఊసులు ఆయే
నను తాకిన మల్లెల సుగంధాలు
నమ్మలేకున్నానే చెలీ,,నీ మనసు
నను చేరిందని నిను వదలి
నమ్మిన ప్రతిక్షణం
మనసాయే కడలి తరంగం..............................

నువ్వు నాదానివని తెలిసిన ఎదలో
ఉవ్వెత్తున ఎగసేను ఆశలు
నిమిషమైనా వీడవే
చెలీ నువ్వు చేసిన బాసలు
వీచే ఈ లేత గాలుల అలజడి ఆయే
నీ చేతి గాజుల సవ్వడి
నువ్వు నేను ఐతే మనం ,జీవితం
కాదా తీగలల్లిన విరి వనం
నమ్మలేకున్నానే చెలీ
కానున్నావని నువ్వు నా ఆలి
నమ్మిన ప్రతిక్షణం,మనసాయే
పడి లేచిన సాగర కెరటం.................................

No comments:

Post a Comment