Dec 8, 2009

ఊసులు .......

మాటై మారేనా ఈ బాధ
పదమై కూరేనా ఈ గాధ
ఎందుకో ఈ పూట కంట నీరు ఆగనంటుంది
ఉప్పెనై బయటకు ఉరుకుతుంది ,,,,,
ప్రతి ఘడియ నిను కలిసే సమయం కోసం ఎదురు చూపులు
నువ్వు పిలిచే ఒక పిలుపు కోసం ఆరాటాలు
నీ మోము పై ఓ చిన్న నవ్వు కోసం
ఈ పిచ్చి మనసు వేయించే వెర్రి వేషాలు
బాధ కూర్చిన ఈ తీపి ఘడియలు ఎన్నో
గుప్పెడైన ఈ గుండెకు చెప్పనైన అలివి కాని ఊసులు ఏమిటో ....
అలుపెరగని సంద్రపు అలలు
ఏదో ఆశతో తీరం వైపు ఎగసినట్లు..
పగలు రేయి బేదం ఎరుగక
ఈ హృదయం నీ చెంతకు పరుగులు తీస్తుంది ....
మన జీవన గ్రంధాన
జారుతున్న ప్రతి క్షణం ఒక పేజీలా తిరుగుతుంది
జరుగుతున్నప్రతి రోజూ ఒక అధ్యాయ మై మారుతుంది
ఇందులో ఏర్పడిన అవగాహన ఎంతో
గ్రహించ వలసిన జ్ఞానం ఇంకెంతో .....

1 comment:

  1. నీ మోము పై ఓ చిన్న నవ్వు కోసం
    ఈ పిచ్చి మనసు వేయించే వెర్రి వేషాలు

    ప్రేమించే హృదయానికే అర్థం అవుతుంది ఆ వేదన. ఆవేదన.

    అలుపెరగని సంద్రపు అలలు
    ఏదో ఆశతో తీరం వైపు ఎగసినట్లు..

    జీవితపు గమ్యాన్ని సూచిస్తూ

    జారుతున్న ప్రతిక్షణం తేనేలో మునుగుతూ అమృతమయమయ్యింది అంతేనా ? కాదు ! ప్రేమలో మునిగితేలింది ప్రతీ అక్షరం. నిజమే రవి కిరణాలను లత బాగా అల్లుకుంది. అల్లుకుని తన భావుకుతను ఇలా జిజ్ఞాస ఉన్న పారిపై అన్నమయ్యాలా తన అక్షర రసాన్ని చల్లుతూ ఉంది.

    ReplyDelete